Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

దేవి
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (17:48 IST)
Vicky Kaushal, Chava
ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాధని వివరించే చారిత్రక ఇతిహాసం, అపూర్వమైన ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బ్లాక్ బస్టర్ 'ఛావా' తెలుగు రిలీజ్ కు సిద్ధంగా ఉంది! మొదట హిందీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పుడు మార్చి 7, 2025న తెలుగులో డబ్ చేయబడి థియేటర్లలో విడుదల కానుంది.
 
సౌత్ ఇండియన్ సినిమా పవర్‌హౌస్ అయిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్  డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఛావా తెలుగులో రిలీజ్ కానుంది. 300 కంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలను రిలీజ్ చేసిన ట్రాక్ రికార్డ్ వున్న గీతా ఆర్ట్స్ ఛావా సినిమాప్రతి మూలకు చేరేలా చూసుకోవడానికి పర్ఫెక్ట్ పార్ట్నర్.
 
దినేష్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఛావాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు, రష్మిక మందన్న యేసుబాయి భోంస్లేగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారాబాయిగా నటించారు. ఫిబ్రవరి 14న విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది, కేవలం 11 రోజుల్లో భారతదేశంలో ₹417.20 కోట్ల GBOC ని అధిగమించింది.
 
అద్భుతమైన కథనం, పెర్ఫార్మెన్స్, ఛత్రపతి శంభాజీ మహారాజ్ వారసత్వానికి శక్తివంతమైన నివాళితో, ఛావా ప్రేక్షకుల హృదయాల్లో అత్యున్నత స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు వెర్షన్ ఈ సాంస్కృతిక,  సినిమా మూమెంట్ ని మరింత విస్తృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది, ధర్మయోధుడి కథ మరింత మందికి చేరేలా, స్ఫూర్తినిచ్చేలా చూసుకోవాలి. చావా గర్జన తెలుగులో ప్రతిధ్వనించబోతోంది. గెట్ రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amit Shah: తమిళం మాట్లాడలేకపోతున్నాను క్షమించండి.. అమిత్ షా

ప్రపంచ మదుపరుల సదస్సు : భోజన ప్లేట్ల కోసం ఎగబడ్డారు (Video)

Arvind Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ ఏం చెప్పింది?

మద్యం మత్తులో స్నేహితురాలికి తాళి కట్టిన వరుడు... చెంప ఛెళ్లుమనిపించిన వధువు..

రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

తర్వాతి కథనం
Show comments