Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

దేవి
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (17:38 IST)
Guna Shekhar, Bhumika
గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నూతన న‌టీన‌టులు, సీనియ‌ర్ యాక్ట‌ర్స్ కాంబోలో గుణ శేఖర్ ఓ ట్రెండీ టాపిక్‌ మీద ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేటి సమాజాన్ని ప్రతిబింబించేలా సాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా పూర్తయింది. ఈ మేరకు మేకర్లు అప్డేట్ ఇచ్చారు. యుఫోరియా షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
 
యుఫోరియా టైటిల్ గ్లింప్స్, కాన్సెప్ట్ తెలియజేసేలా వదిలిన వీడియో అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంతో విఘ్నేశ్ గ‌విరెడ్డి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌గా సీనియ‌ర్ న‌టి భూమిక ఇందులో ముఖ్య పాత్ర‌లో కనిపించబోతోన్నారు. సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనిక రెడ్డి వంటి వారు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.  
 
షూట్ పూర్తి అంటూ మహా శివరాత్రి సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ప్రారంభించింది. ఇక త్వరలోనే ఈ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు రాబోతోన్నారు.
 
నటీనటులు :భూమిక చావ్లా, సారా అర్జున్, నాసర్, రోహిత్, విఘ్నేష్ గవిరెడ్డి, లిఖిత యలమంచలి, అడ్డాల పృధ్వీరాజ్, కల్ప లత, సాయి శ్రీనికా రెడ్డి, అశ్రిత వేముగంటి, మాథ్యూ వర్గీస్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీనా రెడ్డి, లికిత్ నాయుడు తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments