Rashmika Mandanna as Maharani Yesubai
ప్రతి గొప్ప రాజు వెనుక, సాటిలేని శక్తిగల రాణి ఉంటుంది. మహారాణి యేసుబాయి- స్వరాజ్య గర్వం అనే కాప్షన్ తో రశ్మిక మందన్నా ఎక్స్ లో తన పాత్ర గురించి వివరించే పోస్టర్ ను విడుదల చేసింది. బాలీవుడ్ లో రూపొందుతోన్న ఛవా చిత్రంలోనిది ఆ స్టిల్. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఎ.ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఇంతకు ముందు రాజుగా పోషించిన విక్కీ కౌశల్ పాత్రను విడుదలచేశారు. నేడు రశ్మిక మందన్నా పాత్రను విడుదలచేశారు. కాగా, ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 22న విడుదల చేయనున్నారు. హిందీ బాషలో రూపొందుతోన్న ఈ సినిమాను దక్షిణాది భాషల్లో డబ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కథపరంగా చూస్తే, ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ పోషించిన చారిత్రాత్మక యాక్షన్ చిత్రం. ఇది శివాజీ సావంత్ రచించిన మరాఠీ నవల ఛవా కు అనుకరణ. ఇక ఈ సినిమాను ప్రేమింకుల దినోత్సవం రోజైన 14 ఫిబ్రవరి, 2025న విడుదలచేస్తున్నట్లు ప్రకటించారు.