Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఇకలేరు...

Webdunia
గురువారం, 30 ఏప్రియల్ 2020 (10:14 IST)
బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషి కపూర్ ఇకలేరు. బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకులోనైన ఆయన్ను ముంబైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయనకు వయసు 67 యేళ్లు. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో ఆయన మరణించారు. 
 
నిజానికి రిషి కపూర్ గత కొంత కాలంగా ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ఆయన తన ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఉంటూ యోగా కూడా చేస్తూ వచ్చారు. అయితే, బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక కన్నుమూశారు. 
 
కాగా రిషి కపూర్‌కు భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, కుమార్తె రిద్ధిమా కపూర్ ఉన్నారు. రిషి మరణ వార్తతో బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందంటూ పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, బుధవారమే కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన మరో బాలీవుడ్ నటుడు, పద్మశ్రీ గ్రహీత ఇర్ఫాన్ ఖాన్ ఇదే ముంబై నగరంలో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఈయన తల్లి కూడా సోమవారం జైపూర్‌లో చనిపోయారు. తల్లి మరణంతో మరింతగా కుంగిపోయిన ఇర్ఫాన్ ఖాన్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments