Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెన్నుపోటు పాటపై కేసు... కౌంటరిచ్చిన వర్మ.. ఎలాగంటే?

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (09:13 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో వర్మ లక్ష్మీ ఎన్టీఆర్ వివాదాలను కొని తెస్తోంది. ఈ సినిమాలోని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోని వెన్నుపోటు పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కించపరిచేలా వుందని ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి వర్మ కౌంటరిచ్చారు. 
 
మోహన్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఏపీ సీఎం చంద్రబాబు మాత్రమే తన క్లయింట్‌పై పరువునష్టం కేసును దాఖలు చేయగలరని, పక్కనవాళ్లు చేయలేరని వర్మ తెలిపాడు. ఎస్వీ మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారని.. ఇది కూడా చట్ట ప్రకారం నేరమన్నాడు. వర్మ న్యాయవాది ప్రభాకర్ ద్వారా వర్మ పంపిన లీగల్ నోటీసులో మోహన్ రెడ్డి ఫిర్యాదుతో తన క్లయింట్ పరువుకు భంగం కలిగిందన్నారు. ఈ విషయంలో నోటీస్ అందుకున్న 48 గంటల్లోగా మోహన్ రెడ్డి తాను పెట్టిన పోలీస్ కేసును విత్ డ్రా చేసుకోవడంతో పాటు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments