Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగమ్మాయి అత్యాచారం, హత్య: నిందితుడికి బాంబే హైకోర్టు మరణ శిక్ష

తెలుగమ్మాయి అత్యాచారం, హత్య: నిందితుడికి బాంబే హైకోర్టు మరణ శిక్ష
, శుక్రవారం, 21 డిశెంబరు 2018 (18:33 IST)
2015లో ముంబైలో అత్యాచారం, హత్యకు గురైన తెలుగు అమ్మాయి కేసులో దోషికి బాంబే హైకోర్టు మరణ దండన విధించింది. ఆ ఏడాది జనవరి 4న విశాఖ నుంచి లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరి వేకువజామున ముంబై చేరుకుంది సాఫ్ట్వేర్ ఉద్యోగి అనూహ్య. ఆ సమయంలో స్టేషనులో వాహనాలు లేకపోవడంతో ఎదురుచూస్తూ వుంది. 
 
ఇంతలో చంద్రబాన్ అనే ఆగంతుకుడు వచ్చి తనకు రూ. 300 ఇస్తే గమ్య స్థానానికి చేర్చుతానని నమ్మబలికాడు. తొలుత ఆమె అతడి మాటలు నమ్మలేదు. కానీ వేరే వాహనాలు లేకపోవడంతో అయిష్టంగా అతడి ద్విచక్ర వాహనాన్ని ఎక్కింది. దాంతో ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. 
 
ఆనవాళ్లు కనబడకుండా వుండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆనాడు సంచలనం సృష్టించిన ఈ కేసులో సీసీ కెమేరాల సాయంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు సెషన్స్ కోర్టుకు రాగా ముద్దాయికి మరణ దండన విధించింది. దాంతో ఇతడు హైకోర్టుకు వచ్చాడు. విచారించిన హైకోర్టు, కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ మరణ శిక్షను ఖరారు చేసింది. కాగా అనూహ్య కుటుంబం స్వస్థంల కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలకృష్ణ గురించి తెలుసుకోవాలనుకుంటే మనకు వున్నది కూడా పోతుంది: లక్ష్మీపార్వతి