తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. ఈ చిత్రంలోని వెన్నుపోటు పాటను రెండు రోజుల క్రితం రిలీజ్ చేశారు. ఈ పాట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందంటూ టీడీపీ శ్రేణులు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. వర్మ దిష్టిబొమ్మలను దగ్దంచేశారు. అంతేనా, టీడీపీకి చెందిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు కూడా పెట్టాడు.
దీనిపై రాంగోపాల్ వర్మ స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా టీడీపీ శ్రేణులకు కౌంటర్ ఇచ్చాడు. "నేను సీబీఎన్‌గారిని నేరుగా ఒక్క మాట అనలేదు. అలాంటిది నా మీదే కేసులు పెడితే డైరెక్ట్‌గా దూషించిన ఈ క్రింది వీడియోలోని వ్యక్తి మీద ఎన్ని కేసులు పెట్టాలి?' అంటూ గతంలో చంద్రబాబును దూషించిన ఎన్టీఆర్ వీడియోను ఒకదాన్ని పోస్ట్ చేశారు. దీనిపై టీడీపీ శ్రేణుల్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చ సాగుతోంది.