వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ చిత్రంలోని వెన్నుపోటు పాటను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు.
'దొంగప్రేమ నటనలు చూపి కలియుగాన శకునులై చేరినారు.. కన్నవాళ్లు అక్కర తీరి వదిలి వేసినారు.. అసలు రంగు బయటపెట్టి కాటు వేసినారు.. ఒంటరిని చేసి గుంపు దాడి చేసి.. సొంత ఇంటి నుంచే వెలి వేసినారు' అంటూ సాగుతున్న లిరిక్స్‌పై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి.
సిరాశ్రీ రాసిన ఈ పాటకు కల్యాణ్ మాలిక్ సంగీతం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు. బాలయ్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకకి కొద్ది నిమిషాల ముందే వెన్నుపోటు అనే సాంగ్‌ని విడుదల చేసి అందరి అటెన్షన్‌ని తనవైపుకి తిప్పుకున్నాడు.
అయితే, ఈ పూర్తి సాంగ్‌ను విడుదల చేసిన గంటలోనే ఈ సాంగ్‌కి దాదాపు లక్ష వ్యూస్ రావడం విశేషం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత చోటుచేసుకున్న సంఘటనలతో ఈ చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్నాడు. ముంబై వ్యాపారవేత్త బాలగిరికి చెందిన జీవీ ఫిల్మ్స్ సంస్థ సమర్పిస్తోన్న సినిమాను రాకేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు.