Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ మామ టీజ‌ర్ వ‌చ్చేసింది... రెస్పాన్స్ ఏంటి?

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (18:32 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ మూవీకి సంబంధించి చిన్న‌సైజ్ టీజ‌ర్ రిలీజ్ చేసారు.
 
ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే... ఫస్ట్ షాట్‌లోనే వెంకటేష్ మోటార్ బైక్ పైన 'జై జవాన్, జై కిసాన్' అనే బోర్డు చూపించి ఈ సినిమా పాయింట్ ఏంటి అనేది చెప్ప‌క‌నే చెప్పేసారు. ఇక ఈ టీజర్ అంతా కూడా వెంకీ హవా సాగింది. రెండు డైలాగ్స్ కూడా వెంకటేష్ మీదే కట్ చేసారు. ఒకసారి పవర్‌ఫుల్‌గా డైలాగ్ చెప్పి ఫైట్ చేసిన వెంకీ మరొక చోట 'ఐ లవ్ యు అనేసింది' అని ఉబ్బితబ్బిబవుతూ కామెడీ పండించాడు.
 
చైతూని అల్లుడు అని పిలుస్తూనే డైలాగ్స్ చెప్పాడు వెంకటేష్. చైతూని అలా పిలుస్తుంటే... విన‌డానికి.. చూడ‌డానికి చాలా బాగుంది. ప్రేక్ష‌కులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయి అనే ఫీలింగ్ క‌లిగించారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే... వెంకీమామ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసాడు. 
 
ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేట‌ర్లో చూస్తామా అని అభిమానుల‌తో పాటు ప్రేక్ష‌కులు కూడా ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు అంటే ఈ సినిమాపై క్రేజ్ ఎంతుందో అర్ధం చేసుకోవ‌చ్చు. డిసెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నార‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments