Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ గారు పాడడం.. సినిమాకు పనిచేయడం నాకు కలగా వుంది : భీమ్స్ సిసిరోలియో

డీవీ
శనివారం, 4 జనవరి 2025 (18:03 IST)
Bheem's Cicerolio
రమణ గోగుల గారిని అజ్ఞాతంగా ప్రేమిస్తూ ఆరాధిస్తూ వచ్చినవాడిని. తమ్ముడు పాటలు విన్నప్పుడే ఆయనతో ఒక కనెక్షన్ ఏర్పడిపోయింది. నేను లిరిక్ రైటర్ గా వున్నప్పుడు ఆయన పాటకు రాయాలని అనుకున్నాను. ఆయన ఈ పాట విన్న వెంటనే ఒప్పుకున్నారు. పాట విని ఇందులో సోల్ వుందని అన్నారు. ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన ఆయన ఇలాంటి కాంప్లిమెంట్ ఇవ్వడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయనకి ఆయన పాటకి పాదాభివందనం అని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అన్నారు.
 
విక్టరీ వెంకటేష్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించగా, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. జనవరి 14న 'సంక్రాంతికి వస్తున్నాం' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో పలు విషయాలు తెలియజేశారు.
 
- అనిల్ రావిపూడి గారి 'పటాస్' సినిమాకి పని చేసే అవకాశం వచ్చింది. కానీ అప్పుడు కుదరలేదు. ఫైనల్ గా13 ఏళ్ల తర్వాత మళ్ళీ అనిల్ గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది.
 
-దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో బలగం సినిమా చేశాను. సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో వెంకటేష్ గారు అనిల్ గారితో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. ఇదంతా పాటకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. పాట ద్వారా మీ అందరికీ చేరువైనందుకు ఆనందంగా వుంది.
 
-ధమాక, మ్యాడ్, బలగం, రజాకార్, టిల్లు స్క్వేర్ .. ఇలా వరుస హిట్స్ తర్వాత నాకు వచ్చిన గొప్ప అవకాశం సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా పాటలు ప్రతి ఇంట్లో, ప్రతి పల్లెలో వినిపిస్తున్నాయంటే.. అనిల్ గారికి సాహిత్యం, సంగీతంపై వున్న అభిరుచి దీనికి కారణం.  
 
వెంకటేష్ గారిని నేరుగా చూసింది కూడా లేదు. అలాంటిది ఆయన సినిమాకి వర్క్ చేస్తున్నానని తెలియగానే చిన్నప్పటి నుంచి చూసిన ఆయన సినిమాలు, పోస్టర్లు కళ్ళముందు రీల్స్ లా తిరిగాయి. అయితే అనిల్ గారు నా వర్క్ ని ఈజీ చేశారు. తనకి ఏం కావాలో చాలా క్లారిటీగా చెప్పారు. వర్క్ చాలా ఫాస్ట్ గా చేశాం. అనిల్ గారి గారు ఇచ్చిన ఫీడ్ కారణంగానే ఆల్బమ్ ఇంత అద్భుతంగా వచ్చింది.  
 
-వెంకటేష్ గారి సినిమాకి పని చేయడం దేవుని దయగా భావిస్తున్నాను. ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ పొంగల్ సాంగ్ స్వయంగా వెంకటేష్ గారు ఆయనంతట ఆయనే వచ్చి పాడటం కూడా దేవుని దయగా భావిస్తున్నాను. అదో కలలా అనిపించింది. సంగీత దర్శకుడిగా ఇది నాకో ఎచీవ్మెంట్. వెంకటేష్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నా జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం పేరు సంక్రాంతికి వస్తున్నాం.
 
ఈ సినిమా తర్వాత మ్యాడ్ 2, మాస్ జాతర, టైసన్ నాయుడు, డకాయిట్ సినిమాలు చేస్తున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: మార్చిలో జనసేన ప్లీనరీ.. మూడు రోజులు ఆషామాషీ కాదు.. పవన్‌కు సవాలే...

TTD Chairman : తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. జనవరి 10, 11 12 తేదీల్లో రద్దీ వద్దు

మానవత్వం మంటగలిసిపోయింది.. ట్రక్ డ్రైవర్ గాయపడితే.. ఫోన్, డబ్బు దొంగలించేశారు.. (video)

ఇద్దరితో వివాహం, మరో ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన నగల వ్యాపారి

ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారా.. విమానాలు నడుపుతున్నారా? బస్సు మధ్యలో వ్యక్తి.. ఏమైంది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments