Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోసం అందరూ ప్రార్థించారు : ఉన్ని ముకుందన్

డీవీ
శనివారం, 4 జనవరి 2025 (17:46 IST)
Unni Mukundan
తొలిసినిమా జనతా గ్యారేజ్ సినిమాలో నటించి తరువాత భాగమతి, ఖిలాడి చిత్రాల్లో పరిచయం అయిన ఉన్ని ముకుందన్  తాజాగా మార్కో సినిమాలో నటించారు. మలయాళంలో రూపొందిన ఈ సినిమా జనవరి 1న తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో తొలి రోజు హయ్యస్ట్ వసూళ్లు సాధించిన మలయాళం మూవీగా నిలిచింది. ఈ సందర్భంగా హీరో ఉన్ని ముకుందన్ మార్కో విశేషాల్ని పంచుకున్నారు. 
 
- ఇందులో యాక్షన్ భాగాన్ని షూట్ చేస్తున్నప్పుడు నేను గాయపడకుండా చూసుకోవాలనుకున్నాను. అందరూ దాని కోసం ప్రార్థించారు. ఏదైనా గాయం అయితే షూట్ ఆగిపోతుంది. అదృష్టవశాత్తూ అన్నీ బాగానే జరిగాయి. క్యారెక్టర్ కోసం మంచి ఫిజిక్ ని రెడీ చేయాల్సి వచ్చింది. బిల్ట్‌ని మెయింటెయిన్ చేయడం ఛాలెంజింగ్ గా అనిపించింది.
 
-వెరీ ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. చాలా హార్డ్ వర్క్ చేశాం. ఫైట్ సీక్వెన్స్ ఎప్పుడూ రిస్క్ తో కూడుకున్నవే. నేను ఎలాంటి డూప్స్ ఉపయోగించలేదు. సినిమా A సర్టిఫికేట్ పొందినందున ప్రొడక్షన్ విషయంలో కూడా చాలా రిస్క్ ఉంది, కానీ ఇప్పుడు A సర్టిఫికేట్ పొందిన సినిమాతో 100cr క్రాస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.
 
ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలని బలంగా అనుకున్నాను. తెలుగు ప్రేక్షకులు కొత్తదనంను ఆదరిస్తారు. బాహుబలి, ఈగ.. ఇలా రాజమౌళి సర్ తీసిన సినిమాలు హై టైమ్ ప్రయోగాలే అయినా ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు. ఇలాంటి సినిమా తీయడానికి అదొక స్ఫూర్తి. తెలుగు ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు. త్వరలో మరో సినిమాతో మీ ముందుకు వస్తాను అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments