Webdunia - Bharat's app for daily news and videos

Install App

`నార‌ప్ప‌` షూటింగ్ పూర్తి, మే14న విడుద‌ల‌

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (17:02 IST)
Venkatesh, Narappa
సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి,  వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలుచేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజైన `నార‌ప్ప` టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ మూవీ షూటింగ్ జ‌న‌వ‌రి 31తో పూర్తికానుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా మే 14 ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించింది చిత్ర యూనిట్‌.
 
విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి, కార్తిక్ ర‌త్నం, రావు ర‌మేష్‌, రాజీవ్ క‌న‌కాల త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్‌: మార్తాండ్ కె. వెంకటేష్‌, ఆర్ట్‌: గాంధీ నడికుడికర్‌, కథ: వెట్రిమారన్‌, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, విజయ్‌, లిరిక్స్‌: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్‌ తేజ, అనంతశ్రీరామ్‌, కృష్ణకాంత్‌, కాసర్ల శ్యాం, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: విజయ్‌ శంకర్ డొంకాడ, కో- ప్రొడ్యూసర్‌: దేవి శ్రీదేవి సతీష్ నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ, ఒడిశాలలో మోదీ పర్యటన.. రూ.2లక్షల కోట్లకు పైగా ప్రాజెక్టులకు శ్రీకారం

పిల్లలు లేని స్త్రీలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 13 లక్షలు, బీహారులో ప్రకటన, ఏమైంది?

15 చోట్ల పగిలిన తల... 4 ముక్కలైన కాలేయం... బయటకొచ్చిన గుండె... జర్నలిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు!

ఓయో రూమ్స్: బుకింగ్ పాలసీలో ఆ సంస్థ తెచ్చిన మార్పులేంటి? జంటలు తమ రిలేషన్‌కు ఆధారాలు ఇవ్వాలని ఎందుకు చెప్పింది?

భర్త పిల్లలను వదిలేసి బిచ్చగాడితో పారిపోయిన మహిళ.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

తర్వాతి కథనం
Show comments