పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. ఎందుకో అందరూ ఆచార్య అంటారు.. (టీజర్)

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (16:49 IST)
మెగాస్టార్ చిరంజీవిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదలైంది. ముందుగా ప్రకటించినట్టుగానే ఈ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
"ధర్మస్థలి తలుపులు తెరుచుకున్నాయి" అంటూ కొణిదెల ప్రొ కంపెనీ ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక.
 
"ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం... అలాంటి వాళ్ల జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు" అంటూ సాగే డైలాగుతో టీజర్ మొదలవుతుంది. 
 
అంతేకాదు, తనను 'ఆచార్య' అనడం వెనుకున్న కాన్సెప్ట్‌ను‌ కూడా చిరంజీవి వెల్లడించడం ఈ టీజర్‌లో చూడొచ్చు. పాఠాలు చెప్పే అనుభవం లేకపోయినా అందరూ నన్ను ఎందుకో ఆచార్య అంటుంటారు.. బహుశా.. గుణపాఠాలు చెబుతానని కాబోలు అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ అదిరిపోయింది. 
 
కాగా, ఈ సినిమాను కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ పతాకాలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించాడు. అలాగే, రామ్ చరణ్ కూడా సిద్ధూ అనే పాత్రలో కనిపించనున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేడే 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ - పసుపు జెండా పౌరుషం ఎన్నిటికీ తగ్గదు : చంద్రబాబు

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. ఏసీ బోగీలో మహిళపై అత్యాచారం

ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోంది.. అధికారులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు : మమతా బెనర్జీ

రెండేళ్ల క్రితం వివాహం చేసుకుని... ప్రియుడే కావాలంటూ సెల్ టవరెక్కిన మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments