డబ్బింగ్ ప్రారంభించిన వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం

డీవీ
సోమవారం, 28 అక్టోబరు 2024 (15:27 IST)
Venkatesh
విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ #VenkyAnil03 షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పార్ట్ పూర్తయింది. ఈ చిత్రానికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పరిశీనలో వుంది.
 
తాజాగా టీమ్ డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన డిలైట్ ఫుల్ వీడియో వేడుక వాతావరణాన్ని చూపిస్తోంది, వెంకటేష్‌ని అతని భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్,  కుటుంబంతో పాటు అందరూ ఉత్సాహంగా కనిపించారు. వెంకటేష్ చరిష్మా, రావిపూడి హ్యుమర్ తో ఈ మూవీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.
 
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా కనిపించనుంది.
 
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. సంక్రాంతికి 2025లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments