బాలకృష్ణ ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదని చెప్పడం... ఈ వ్యాఖ్యలకు సమాధానంగా నాగబాబు తనకు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదు అంటూ ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం ఈమధ్య కాలంలో మీడియాలో ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. ఇదిలా ఉంటే... వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం అంతరిక్షం. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్‌లో భాగంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడినప్పుడు ఈ వివాదానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ వివాదం గురించి వరుణ్ తేజ్ సమాధానం ఏంటంటే... మా నాన్న పర్సనల్ లైఫ్ గురించిన విషయాలపై నేను ఎప్పుడూ క్వశ్చన్ వేయను. ఆయన పొలిటికల్‌గా ఏదో రైట్ అనుకున్నారు అనేశారు. మా నాన్నకు రైట్ అనిపించకుంటే ఏదీ చేయడు. రైట్ అనిపిస్తేనే చేస్తాడు. ఆయన ఏం చేసినా ఓ కారణం ఉంటుంది అన్నాడు. అదీ..సంగతి..!