Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌రుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున షూటింగ్ పూర్తి- ఆగస్ట్ రిలీజ్

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (16:48 IST)
Gandheevadhari Arjuna
వరుణ్ తేజ్..కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించు కున్న కథానాయకుడు. తనదైన శైలిలో మరోసారి మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాయే ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ ప‌క్కా యాక్ష‌న్ మోడ్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. 
 
వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో  ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ సినిమా ఎంటైర్ షూటింగ్ పూర్త‌య్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఆగస్ట్ 25న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. 
 
‘గాంఢీవధారి అర్జున’ షూటింగ్ పూర్త‌యిన విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేకర్స్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇందులో వ‌రుణ్ తేజ్ చాలా స్టైలిష్‌గా క‌నిపిస్తున్నారు.  చేతిలో గ‌న్ ప‌ట్టుకుని నిలుచుని ఉన్నారు. వ‌రుణ్‌తేజ్ ఈ చిత్రంలో సెక్యూరిటీ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తారు. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిస్థితుల నుంచి ప్ర‌జ‌లను అత‌ను ఎలా కాపాడాడు, అత‌ని స్ట్రాట‌జీస్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ఆగ‌స్ట్ 25 వ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్ అందిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments