Varun Tej, Lavanya Tripathi
టాలీవుడ్ స్టార్స్ ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ కూల్ పిక్‌ను షేర్ చేసుకున్నాడు. లావణ్యతో కలిసి విదేశాల్లో విహరిస్తు్న వరుణ్ తేజ్‌ను ఆ ఫోటోల్లో చూడొచ్చు.
ఈ ఇన్‌స్టా పోస్టులో వరుణ్ స్పందిస్తూ.. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు.
పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలోనూ వరుణ్ తేజ్ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఉత్తరాది బ్యూటీ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.