Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ్ డైరెక్టర్ ఎన్.కృష్ణకు ఎ.ఆర్.రెహమాన్ అభినందనలు- త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌

Webdunia
బుధవారం, 28 జూన్ 2023 (16:40 IST)
Obeli N. Krishna. AR Rahman
తమిళ దర్శకుడు ఒబెలి ఎన్.కృష్ణ.. సూర్య, జ్యోతిక, భూమికతో సిల్లుఇండ్రు ఒరు కాదల్ సినిమాతో డైరెక్టర్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించారు. ఈ సినిమా తెలుగులో 'నువ్వు నేను ప్రేమ'గా రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఒబెలి కృష్ణ ఇటీవల తమిళ్ స్టార్ హీరో శింబుతో 'పాతు తల' సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. 
 
'పాతు తల' సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఆ సమయంలో డైరెక్టర్ కృష్ణ ట్యాలెంట్‌ని చూసి అభినందించారు. కృష్ణ ట్యాలెంట్‌ని అభినందిస్తూ ఎ.ఆర్.రెహమాన్ ఒక Apple MacBook Proని కృష్ణకు బహుమతిగా ఇచ్చారు. ఆస్కార్ అవార్డు అందుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ని కృష్ణ తన సినిమా ట్యాలెంట్‌తో మెప్పించారు. 
 
కృష్ణ మాస్ సినిమాతో పాటు లవ్ సినిమాలు స్టార్ హీరోలతో తీసి హిట్స్ కొట్టారు. ఇప్పుడు మరో కొత్త జోనర్‌లో భారీ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నారు డైరెక్టర్ కృష్ణ. ఈసారి పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నారు. ప్రముఖ తమిళ నిర్మాత, గ్లోబల్ వన్ స్టూడియోస్‌ అధినేత రమేష్ కృష్ణమూర్తి నిర్మాణంలో డైరెక్టర్ కృష్ణ ఓ స్టార్ హీరోతో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని తెరకెక్కిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ విషయంలో ఎ.ఆర్.రెహమాన్ డైరెక్టర్ కృష్ణను అభినందించారు. 
 
త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన డీటెయిల్స్‌ని డైరెక్టర్ కృష్ణ అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో డైరెక్టర్‌గా కృష్ణ స్థాయి మరింత పెరగనుంది. ఒకపక్క డైరెక్టర్ గానే కాక నటుడిగా కూడా అప్పుడప్పుడు పలు సినిమాల్లో కనిపిస్తున్నారు. ఇటీవల తాను తెరకెక్కించిన పాతు తల సినిమాలో కూడా ఓ ముఖ్య పాత్ర చేశారు కృష్ణ. ప్రేక్షకులని మెప్పించడానికి త్వరలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో రానున్నారు డైరెక్టర్ కృష్ణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments