Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంట‌లో 1.3 మిలియ‌న్ కి పైగా వ్యూస్ సాధించిన‌ ‘వాలిమై’ మోషన్ పోస్టర్

Webdunia
సోమవారం, 12 జులై 2021 (11:27 IST)
Alimai
అజిత్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్  ‘వాలిమై’. ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వాలిమై’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ బ్యానర్ లో జీ స్టూడియోస్, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన మోషన్ పోస్టర్ ఆదివారం సాయంత్రం నిర్మాత బోనీకపూర్ విడుదల చేశారు.

ఈమధ్యకాలంలో సోషల్‌ మీడియాలో ఎక్కువగా పాపులర్‌ అయిన సినిమా ఇది. ఈ సినిమా అప్‌డేట్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ క్రేజ్‌ ఉన్న ఆట ఫుట్‌బాల్‌. లండన్‌లో యూరో 2020 మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో అజిత్‌ కొత్త సినిమా ‘వాలిమై’కి సంబంధించిన అప్‌డేట్‌ తెలియజేయాలంటూ అజిత్‌ ఫ్యాన్స్‌ చూపిస్తున్న ఫ్లకార్డ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.  ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అజిత్‌ క్రేజ్‌ ఎంతలా ఉందో ఈ ట్వీట్‌ తెలియజేస్తుంది. రెగ్యులర్‌గా ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక న్యూస్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉంటుంది.  ఈ చిత్రంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే డిఫరెంట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉంటాయి. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. వాలిమై మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌లైన ఒక గంట‌లో 1.3 మిలియ‌న్ కి పైగా వ్యూస్ సాధించి ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

దేవాన్ష్ పుట్టిన రోజు - తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు

కాడాబాంబ్ ఒకామి- అరుదైన వోల్ఫ్ డాగ్.. రూ.50 కోట్లు ఖర్చు చేసిన సతీష్.. ఎవరు?

చంద్రబాబు కంటే జగన్ ఆస్తులు తక్కువా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments