హాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ఇండియాలో కోవిడ్ మరణాలు గురించి విని చలించిపోయారు. ముఖ్యంగా పిల్లలు కూడా ఆక్సిజన్ అందక, ఆసుపత్రిలో బెడ్‌లు దొరక్క ఇబ్బందులు పడుతున్న తీరు ఆమెను కలచివేసింది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్‌మీడియాలో వెల్లడించింది. గ్లోబల్ చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా నేను పలు కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపింది. ముందుగా ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్ తో పాటు 100 పడకల హాస్పిటల్ నిర్మిస్తామని ప్రకటించారు.
గత రెండు వారాలుగా ఇండియాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్నా. చాలా బాధని కలిగించింది. ఆందుకే ఆమె వివరాలు తెలుపుతూ, ఢిల్లీలో తాత్కాలిక ఆసుపత్రి సౌకర్యాన్ని నిర్మించడానికి మేము కృషి చేస్తున్నాము, అది 100 పడకలతో పాటు ఆక్సిజన్ ప్లాంటును కలిగి ఉంటుంది. ఇంట్లో చికిత్స కోసం రోగులకు మెడికల్ కిట్లను అందించడం కూడా ఈ ప్రాజెక్ట్ లక్ష్యం, ఇందులో రోగి పూర్తిస్థాయిలో కోలుకునేలా చూడటానికి డాక్టర్ & సైకో సోషల్ థెరపిస్ట్‌తో సంప్రదింపులు ఉంటాయి అన్నారు. మాతో చేయి కలిపి ముందుకు వచ్చేవారికి ఆమె ఆహ్వానం పలికారు కూడా.