వైష్ణ‌వ్ తేజ్ మొద‌టి సినిమా కొండ పొలం సిద్ధ‌మ‌వుతోంది

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:27 IST)
Konda polam
`ఉప్పెన‌`కు ముందే సినిమా ప్రారంభించిన వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం `కొండ పొలం` విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ టైటిల్ ను కొండ పొలంగా పెట్టారు. కొండ ప్రాంతంలో ఓ పొలంలో వైష్ణ‌వ్ క‌నిపిస్తూ గేలం వేస్తున్న మోష‌న్ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారంనాడు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 
 
ఇది సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల ‘కొండ పొలం’ ఆధారంగా రూపుదిద్దుకుంది. వైష్ణవ్ తేజ్ కటారు రవీంద్ర యాదవ్ గా కనిపించబోతున్నాడు. శుక్రవారం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరోయిన్ రకుల్ ప్రీత్ ట్విట్ చేసింది. త‌ర్వాత చిత్ర దర్శకుడు క్రిష్ మరికొందరు సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ పోస్టర్ ను, మోషన్ మోషన్ ను రిలీజ్ చేశారు. 
 
జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీని, ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నిఅందిస్తున్న చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేస్తున్న‌ట్లు డేట్ ఫిక్స్ చేశారు. వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ సముద్రం నేపథ్యంలో తెరకెక్కగా, ఈ రెండో సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో రూపుదిద్దుకోవడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Drones: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మందుల సరఫరాకు రంగంలోకి డ్రోన్‌లు

పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ - అమ్మకానికి పెట్టిన పాక్ పాలకులు

పైరసీ చేసినందుకు చింతిస్తున్నా, వైజాగ్‌లో రెస్టారెంట్ పెడ్తా: ఐబొమ్మ రవి

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments