Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ కొండపొలం : ఉప్పెన తర్వాత

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:09 IST)
మెగా ఫ్యామిలీకి చెందిన హీరో వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలా వేసుకున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన నటించే రెండో చిత్రానికి "కొండపొలం" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా, క‌రోనా వైరస్ కారణంగా ఈ చిత్రం విడుదలలో జాప్యం జరిగింది. 
 
అడవి నేపథ్యంలో సాగే ఈ మూవీని ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటించింది. అక్టోబ‌ర్ 8న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ రీసెంట్‌గా ప్ర‌క‌టించారు.
 
తాజాగా చిత్రానికి "కొండ పొలం" అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో వైష్ణ‌వ్ తేజ్ మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. తొలి సినిమాలో త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న వైష్ణ‌వ్‌తేజ్ రెండో సినిమాతోను అల‌రిస్తాడ‌ని చెబుతున్నారు. 
 
‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా ఈ సినిమాకి అదే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అడవి జంతువులూ తిరిగే చోట నీరు కూడా దొరకని పరిస్థితుల్లో రైతు జీవనం ఎలా సాగింది అన్న కథతో ఈ సినిమా వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాయలసీమ, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments