Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మీలో ఆ ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్.. ఐటమ్ గర్ల్‌గా ఆమె పక్కా? ఉప్పెన హీరో

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (21:28 IST)
Vaishnav_Rashmi
మెగాస్టార్ చిరంజీవి అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ ఒకరు. ఉప్పెన సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే ఎంతో మంచి హిట్ అందుకున్నారు.
 
ఈ సినిమా తర్వాత ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈయన నటించిన తదుపరి చిత్రాలు రెండు కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇలా వైష్ణవ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం రంగా రంగా వైభవంగా. గిరీషయ్యా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. 
 
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా వైష్ణవ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ వైష్ణవ్ తేజ్‌ను ప్రశ్నిస్తూ.. మీ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలనుకుంటే ఏ హీరోయిన్ చేయాలని భావిస్తారంటూ ప్రశ్నించారు. 
 
ఇక ఈ ప్రశ్నకు వైష్ణవ్ తేజ్ ఊహించని విధంగా యాంకర్ రష్మీ పేరు చెప్పారు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రష్మీ పేరు చెప్పడమే కాకుండా రష్మీలో హాట్ ఎక్స్‌ప్రెషన్స్ పలికించే తీరు తనకు ఎంతగానో నచ్చుతాయని ఈ మెగా హీరో షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 
ఈ విధంగా వైష్ణవ్, రష్మీ గురించి ఇలాంటి సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాకయ్యారు. అదేంటి వైష్ణవ్ రష్మీ గురించి అలా మాట్లాడేసావ్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments