Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మెగాస్టార్ చిరంజీవి నిజ జీవితంలో కూడా హీరో - గ‌వ‌ర్న‌ర్ డా. త‌మిళిసై

Megastar Chiranjeevi, Governor Dr. TAMILISAI, swami naidu
, సోమవారం, 5 సెప్టెంబరు 2022 (09:37 IST)
Megastar Chiranjeevi, Governor Dr. TAMILISAI, swami naidu
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 ప‌ర్యాయాలకు పైగా రక్తదానం చేసిన రక్తదాతలకు రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ డా. త‌మిళిసై, మెగాస్టార్ చిరంజీవి స‌న్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ డా. త‌మిళిసై మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తెర‌మీదే కాకుండా నిజ జీవితంలో కూడా రియ‌ల్ హీరో అని కొనియాడారు. తాను సేవ చెయ్యడమే కాకుండా  ల‌క్ష‌లాదిమంది సామాజిక సేవ చేసే విధంగా ప్రేరేపించార‌ని ప్ర‌శంసించారు.  
 
ఒక వైద్యురాలిగా రక్తం కొరత తనకు తెలుసని, రక్తదానం చేయమని ప్రజలను ఒప్పించడం ఎంత కష్టమో కూడా తనకు తెలుసని ఆమె అన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఆయన అభిమానుల నిబద్ధతను ప్రభావితం చేయడం వల్లే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అద్భుతమైన మైలురాళ్లను సాధించడం సాధ్యమైంది.
 
webdunia
chiru-tamalisai and others
చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ 25 ఏళ్లుగా సేవ‌లందిస్తుంద‌ని చెప్పారు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 9ల‌క్ష‌ల 30వేల యూనిట్ల రక్తాన్ని సేక‌రించ‌డం అసాధార‌ణ విష‌య‌మ‌న్నారు. వీటిలో  79% పేదలకు, అణగారిన వర్గాలకు ఉచితంగా పంపిణీ చేశారు, మిగిలిన యూనిట్లను కార్పొరేట్ ఆసుపత్రులకు నామమాత్ర రుసుముకు అంద‌జేసిన‌ట్లు గ‌వ‌ర్న‌ర్ చెప్పారు. చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ మాత్ర‌మే కాకుండా ఐబ్యాంక్ కూడా నిర్వ‌హిస్తున్న విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు. ఐ బ్యాంక్ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 4,580 జ‌త‌ల క‌ళ్లు సేక‌రించిన‌ట్లు చెప్పారు. వీటి ద్వారా 9,060 మంది అంధుల‌కు చూపు తెప్పించార‌న్నారు. ఇవే కాకుండా క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో చిరంజీవి చారిట‌బుల్ ట్ర‌స్ట్ అద్భుత‌మైన సేవ‌లు అందించింద‌ని ప్ర‌శంసించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌లో ఆక్సిజ‌న్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడార‌ని అన్నారు.
 
webdunia
Doners with chiru-tamilisai
చిరంజీవి బృహ‌త్త‌ర‌మైన ఆలోచ‌న‌ల‌కు అండగా నిలుస్తూ చిరంజీవి ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా రక్తదానం చేసిన వారిని ఈ సందర్భంగా గ‌వ‌ర్న‌ర్ తమిళిసై అభినందించారు. వీరు ఎంతోమంది ప్రాణాలు కాపాడ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని ప్ర‌శంసించారు.
 
ర‌క్త‌దాత‌ల‌ను స‌న్మానించ‌డంతో పాటు “చిరు భ‌ద్రత” కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ డా.త‌మిళిసై గారికి మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ ర‌క్త‌దానం చేసి ఇత‌రుల ప్రాణాలు కాపాడాల‌ని చిరంజీవి కోరారు. ఒక దాత ఇచ్చిన ర‌క్తంతో ముగ్గురిని బ్ర‌తించ‌వ‌చ్చ‌ని చెప్పారు. రక్త‌దానంపై అవగాహనా పెంచ‌డంలో గ‌వ‌ర్న‌ర్ డా. త‌మిళిసై పాత్ర‌ను ప్ర‌శంసించారు. ఈ సంద‌ర్భంగా ర‌క్త‌దాత‌ల‌ను అభినందించిన చిరంజీవి వీరే నిజ‌మైన వీరుల‌నీ, ఇత‌ర‌కు ఆద‌ర్శంగా నిలుస్తార‌ని చెప్పారు.
 
ఈ కార్యక్రమంలో రక్తదాతలకు గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా ‘చిరు భద్రత’ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కార్డులను అందజేశారు. వీరందరూ వందలాది మంది ప్రాణాలను కాపాడారని చిరంజీవి అభినందించారు. వీరినీ, వీరి కుటుంబాలను కాపాడాల్సిన బాధత్య తనపై ఉందని ఈ సందర్భంగా చిరంజీవి చెప్పారు. 
 
తరచుగా రక్తదానం చేసే 2000 మందికి 7లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వీరందరి ఇన్సూరెన్స్ ప్రీమియం చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ చెల్లింస్తుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రహ్మాస్త్రాన్ని ప్రమోట్ కోసం క్యాష్ గేమ్ షోలో రణబీర్ కపూర్, అలియా భట్, రాజమౌళిRanbir Kapoor, Alia Bhatt, Rajamouli on Cash Game Show to Promote Brahmastra