Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బజరంగీ భాయిజాన్‌' సీక్వెల్‌కు ఓ ఆలోచన చెప్పా... ఏం జరుగుతుందో చూద్దాం : విజయేంద్ర ప్రసాద్

ఠాగూర్
సోమవారం, 28 ఏప్రియల్ 2025 (08:56 IST)
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినీ కెరీర్‌లోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్‌ మూవీగా నిలిచిన చిత్రం 'బజరంగీ భాయిజాన్'. పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. సల్మాన్ ఖాన్ 'బజరంగీ భాయిజాన్' పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించగా, హర్షాలి పాత్రలో మల్హోత్రా మున్నీ అద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి సీక్వెల్ తీసుకునిరావడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. 
 
దీనిపై ఈ చిత్రానికి కథను అందించిన సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. 'బజరంగీ భాయిజాన్‌' మూవీకి సీక్వెల్‌కు సంబంధించి ఒక ఆలోచన చెప్పానని, ఆ ఆలోచన ఆయనకు నచ్చిందని, అయితే, ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు. ఇక డ్రీమ్ ప్రాజెక్టు "మహాభారతం" గురించి కొన్ని రోజుల క్రితం అమీర్ ఖాన్‌ను కలిశానని చెప్పారు. 
 
కాగా, సల్మాన్ ఖాన్, రాక్‌‌లైన్ వెంకటేష్, కబీర్ ఖాన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. భారతదేశానికి వచ్చి తప్పిపోయిన మున్నీ అనే పాకిస్థానీ అమ్మాయిని తిరిగి తన స్వస్థలానికి చేర్చడమే ఈ సినిమా కథాంశం. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌‍కు భారీ విజయం అత్యవసరమైన నేపథ్యంలో తన బ్లాక్ బస్టర్ మూవీకి రెండో భాగం తీయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. బజరంగీ భాయిజాన్-2 అధికారిక ప్రకటన కోసం సల్మాన్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

పట్టుబట్టిమరీ పహల్గాంలో పెళ్లి రోజు వేడుకలు జరుపుకున్న జంట... (Video)

తిరువనంతపురం ఎయిర్‌పోర్టును పేల్చేస్తాం : బాంబు బెదిరింపు

ప్రభుత్వ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జిల్లా కలెక్టర్ భార్య!!

కాశ్మీర్‌లో నేలమట్టం అవుతున్న ఉగ్రవాదుల స్థావరాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments