Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ ఊర్వశి రౌతలాకు చేదు అనుభవం.. బంగారం లాంటి ఫోన్ పోయింది!

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (12:30 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఈ నెల 14వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో భారత క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతలాకు మాత్రం చేదు అనుభవం ఎదురైంది. తన గోల్డ్ ఐఫోన్‌ను పోగొట్టుకున్నారు. మ్యాచ్ వీక్షణలో మునిగిపోయిన ఊర్వశి అత్యంత ఖరీదైన ఐ ఫోన్‌ను మిస్ చేసుకున్నారు. 
 
ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. తాను పోగొట్టుకున్న ఐ ఫోన్ అలాంటి ఇలాంటిది కాదని అది 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్ అని చెప్పుకొచ్చింది. అది ఎవరికైనా దొరికితే ఇవ్వాలని వేడుకున్నారు. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారుల ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేశారు. ఆమె పోస్టును చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. 
 
ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అంటే.. మరికొందరు మాత్రం ఆ ఫోన్ దొరికిన వ్యక్తి అదృష్టవంతుడు అంటు కామెంట్స్ చేస్తున్నారు. బంగారం లాంటి ఫోన్ దొరికితే ఎవరైనా తిరిగిస్తారా అని ఇంకొందరు అంటున్నారు. కాగా, తెలుగు సినిమాల్లో పలు ప్రత్యేక గీతాల్లో ఆలరించిన ఊర్వశి రౌతలా.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన "వాల్తేరు వీరయ్య" చిత్రంలో బాస్ పార్టీ పాటలో తళుక్కున మెరిసిన విషయం తెల్సిందే. అలాగే ఇటీవల హీరో రామ్ నటించిన "స్కంద" మూవీలోనూ ఆమె నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments