Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అదృశ్యమైన అక్కా చెల్లెళ్లు.. ఇంట్లోని పెట్టెలోనే విగతజీవులుగా..

deadbody
, సోమవారం, 2 అక్టోబరు 2023 (16:17 IST)
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. కనిపించకుండా పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే ఓ పెట్టెలో విగత జీవులుగా పడివున్నారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. ముద్దు ముద్దు మాటలతో సందడి చేసే చిన్నారులు కాంచన (4), శక్తి (7), అమృత (9) ఇక తమ మధ్య లేరన్న వార్తతో ఆ కుటుంబం తీవ్ర శోకంలో మునిగిపోయింది. 
 
పోలీసుల వెల్లడించిన కథనం మేరకు.. జలంధర జిల్లాలో పనికోసం వలస వచ్చిన దంపతులకు ఐదుగురు సంతానం. ఆదివారం పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ముగ్గురు కుమార్తెలు కనబడకపోవడంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ భార్యాభర్తలు మక్సుదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
అయితే, సోమవారం ఇంట్లోని వస్తువులను ఆ చిన్నారుల తండ్రి వేరే చోటకు తరలిస్తున్న సమయంలో ట్రంకు పెట్టె సాధారణం కన్నా అధిక బరువు ఉండటం గర్తించారు. దాన్ని తెరిచి చూడగా ఆ పెట్టెలో ముగ్గురు చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ చిన్నారుల తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో ఇంటిని ఖాళీ చేయాలని ఇటీవలే ఇంటి యజమాని హుకుం జారీ చేశాడని పోలీసులు తెలిపారు. చిన్నారులు మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మరణాలకు కారణాలను తెలుసుకొనేందుకు వీరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్ పూలింగ్‌పై నిషేధం విధించిన కర్నాటక సర్కారు...