బ్యాంక్ పొరపాట్లు, ఇతరత్రా కారణాలతో సామాన్యుల ఖాతాల్లో భారీగా నగదు జమ అయిన ఘటనలు వినేవుంటాం. తాజాగా అలాంటి ఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. పంజాబ్ సర్కారు చేసిన చిన్న తప్పుతో విద్యార్థుల ఖాతాల్లోకి రూ.3కోట్ల స్కాలర్షిప్ అమౌంట్ క్రెడిట్ అయ్యింది.
2022-23 అకడమిక్ సెషన్‌కు సంబంధించి ఇవ్వాల్సిన దాని కన్నా రూ.3 కోట్లు అదనంగా జమ చేసింది. సాంకేతిక తప్పిదం కారణంగా ఇలా జరిగినట్లు అధికారులు వివరణ ఇచ్చారు.
అక్టోబర్ 30లోగా డబ్బులు రికవరీ చేయాలని ఆదేశించారు. దాదాపు 24 వేల మంది ఖాతాల్లోకి డబ్బు జమ కాగా, రికవరీ బాధ్యతను టీచర్లకే అప్పగించాల్సి వచ్చింది.