Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కెనడాలో మరో ఖలీస్తానీ సానుభూతిపరుడు హత్య

sukh duneke
, గురువారం, 21 సెప్టెంబరు 2023 (18:49 IST)
కెనడా దేశంలో మరో ఖలీస్థాన్ సానుభూతిపరుడు హత్యకు గురయ్యాడు. ఖలీస్థాన్ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఈ గ్యాంగ్‌స్టర్ పేరు సుఖ్‌దోల్ సింగ్ అలియాస్ సుఖా దునెకే ప్రాణాలు కోల్పోయినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఖలీస్థాన్ అంశం భారత్ కెనడా దేశాల మధ్య చిచ్చు పెట్టిన విషయం తెల్సిందే. 
 
దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. విన్నెపెగ్‌లో బుధవారం ప్రత్యర్థి గ్యాంగ్ జరిపిన దాడిలో ఈ గ్యాంగ్ స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, ఈ హత్యకు తమ పనేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించుకుంది. 
 
పంజాబ్ రాష్ట్రంలోని మోఘా జిల్లా దేవిందర్ బంబిహా గ్యాంగ్‌కు చెందిన సుఖా దునెఖేపై భారత్‌లో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2017లో నకిలీ ధృవపత్రాలతో కెనడాకు పారిపోయినట్టు సమాచారం. అక్కడకు వెళ్లిన తర్వాత కెనడా కేంద్రంగా పనిచేస్తున్న గ్యాంగ్‌స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాలో చేరినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. పైగా, ఖలీస్థానీ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. 
 
విద్యార్థిని గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు.. ఎక్కడ?  
 
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ వక్రమార్గంలో ప్రయాణించాడు. తన వద్ద చదువుకునే విద్యార్థిని గర్భవతిని చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాలను పరిశీలిస్తే, స్థానికంగా ఉండే ఓ కార్పొరేట్ పాఠశాలలో ఓ విద్యార్థిని కోచింగ్ కోసం చేరింది. ఆ యువతికి ఫిజిక్స్ పాఠాలు బోధించే లెక్చరర్ సైదులు ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఏకాంతంగా ఆ బాలికతో రాసలీలలు గడిపాడు. ఫలితంగా ఆ విద్యార్థిని గర్భందాల్చింది. 
 
అతనికి పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఈ విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. తమ కుమార్తె గర్భవతి అయిన విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఈ నెల 24 నుంచి హైదరాబాద్ - బెంగూళూరుల మధ్య వందే భారత్ రైలు 
 
రైల్వే ప్రయాణికులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న హైదరాబాద్ - బెంగూళూరు ప్రాంతాల మధ్య వందే భారత్ రైలు ఈ నల 24వ తేదీ నుంచి పట్టాలెక్కనుంది. ఈ రైలుకు ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. 
 
కాచిగూడ వేదికగా జరిగే ప్రారంభోత్సవంలో కేంద్ర మాజీ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరి.. మహబూబ్‌‍నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం రెండు గంటలకు యశ్వంత‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11.45కు కాచిగూడ చేరుకుంటుంది.
 
కాగా, ఈ నెల 24వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా మొత్తం 9 వందే భారత్ రైళ్ళను వర్చువల్‌ విధానంలో జెండా ఊపి ప్రారంభించనున్న విషయం తెల్సిందే. వీటిలో విజయవాడ - చెన్నై వందేభారత్ కూడా ఉంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల‌్‌కు చేరుకుంటుంది. 
 
గురువారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుదని వివరించారు. తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20కి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విద్య కోసం మహీంద్రా సారథి అభియాన్ స్కాలర్‌షిప్ పొందనున్న ట్రక్ డ్రైవర్ల కుమార్తెలు