Webdunia - Bharat's app for daily news and videos

Install App

విష్ణు మంచు కన్నప్ప నుంచి ప్రళయ కాల రుద్రుడిగా ప్రభాస్ లుక్ విడుదల

డీవీ
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (16:00 IST)
Rudra
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా "కన్నప్ప" సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ పెంచేశారు. ప్రతీ సోమవారం కన్నప్ప చిత్రంలోని పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం నాడు కన్నప్ప నుంచి ప్రభాస్ పాత్రను రివీల్ చేశారు. 
 
రుద్రుడిగా ఈ చిత్రంలో ప్రభాస్ అద్భుతంగా కనిపించబోతున్నాడు. ప్రళయ కాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు.. శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోషిస్తున్న పవర్ ఫుల్ పాత్రను అందరికీ పరిచయం చేశారు. ప్రభాస్ వేషధారణ, లుక్ చూస్తుంటే దైవత్వం ఉట్టి పడేలా కనిపిస్తోంది.
 
ఇప్పటికే కన్నప్ప నుంచి శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ ఫస్ట్ లుక్ పోస్టర్లను చిత్రయూనిట్ రివీల్ చేసింది. కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి మహామహులెందరో నటిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్ అందరిలోనూ అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. 
 
ఇప్పుడు కన్నప్ప టీం ద్వాదశ జ్యోతిర్లింగాలను సందర్శించే పనిలో పడింది. సినిమా విడుదలయ్యే లోపు పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటానని విష్ణు మంచు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments