Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగాది స్పెషల్.. రౌద్రం.. రణం.. రుధిరం.. ఇదే 'ఆర్ఆర్ఆర్' టైటిల్

Webdunia
బుధవారం, 25 మార్చి 2020 (12:31 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రామజౌళి తెరక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లు హీరోలు కాగా, ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ ఆర్ఆర్ఆర్. అయితే తెలుగు ప్రజల కొత్త సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీ టైటిల్‌ను చిత్రం యూనిట్ ప్రకటించింది. ఒక ఆర్ అంటే రౌద్రం, మరో ఆర్ అంటే రణం, ఇంకో ఆర్ అంటే రుధిరం అనే పేర్లు పెట్టారు. ఈ చిత్రం టైటిల్‌తో పాటు.. మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. 
 
'ఆర్ఆర్ఆర్' టైటిల్‌పై ఎన్నో ఊహగానాలు వచ్చిన విషయం తెలిసిందే. వాటన్నింటికీ రాజమౌళి నేటితో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు మరోవైపు తెలంగాణకు చెందిన కొమరం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కల్పిత కథతో ఈ సినిమాను తీస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి తీస్తోన్న ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
 
ఈ చిత్రం తెలుగుతో పాటు.. హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments