Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్ పెళ్లి గోల... సాయమందిస్తున్న ప్రదీప్

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:55 IST)
గత కొంతకాలంగా ప్రతి పర్వదినాన ఒక ఈవెంట్‌ను ప్రసారం చేయడం ఈటీవీకి పరిపాటిగా మారిపోయింది. ఇక మిగతా ఛానెళ్లు కూడా ఇదే దారిలో వెళ్తూ ప్రముఖ సెలబ్రిటీలు, బుల్లితెర నటులు, కమెడియన్స్, సింగర్‌లు, డ్యాన్సర్‌లతో పలు ఈవెంట్‌లను రూపొందించి ప్రసారం చేస్తున్నారు.


అయితే ఈటీవీలో ప్రసారమయ్యే ఈవెంట్‌లకు మాత్రం టిఆర్‌పి ఓ రేంజ్‌లో ఉంటోంది. ఈటీవీలో ఎక్కువ టిఆర్‌పీ అందిస్తున్న ప్రోగ్రామ్‌లలో మొదటి వరుసలో కామెడీ ప్రోగ్రామ్‌లైన జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఢీ ఉంటాయి.
 
ఇలాంటి ఈవెంట్‌లలో వీరందరూ కలిసి పెర్ఫామ్ చేస్తుంటారు. ఈ ఏడాది ఉగాది కానుకగా జబర్దస్త్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ పేరు మీద “సుధీర్ గాడి పెళ్లి గోల” అనే స్పెషల్ ప్రోగ్రామ్ ఈటీవీలో ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. 
 
ఇందులో ఢీ ప్రోగ్రామ్ నుండి ప్రదీప్, శేఖర్ మాస్టర్, ప్రియమణి, రష్మిలతో పాటు భానుశ్రీ, వర్షిణి, మంగ్లీ మొదలైన సెలబ్రిటీలు హల్‌చల్ చేయనున్నారని ప్రోమో చూస్తే తెలుస్తోంది. సుధీర్ స్వయంవరం జరుగుతుండగా, ప్రదీప్ దానిని నిర్వహిస్తున్నట్లు, ఒక్కో సెలబ్రిటీ తన తరఫున ఒక్కో అమ్మాయిని స్వయంవరానికి తీసుకొస్తున్నట్లు కనిపిస్తోంది. 
 
ఇక సుధీర్ మీద అందరూ పంచులు వేస్తూ, దానికి సుధీర్ అమాయకమైన సమాధానాలు, లుక్స్ ఇస్తూ నవ్వులపువ్వులు పూయిస్తున్నారు. ఇక రష్మి ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. మొత్తానికి సుధీర్ పెళ్లి కష్టాలేమో గానీ ప్రేక్షకులకు మాత్రం ఈ ఉగాది నాడు వినోదానికి కొదవుండదన్నమాట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments