Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మో.. కంగనా మామూలుది కాదు.. అలాంటి వారు భూమి మీద లేదట!!

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:12 IST)
బోల్డుగా మాట్లాడటంతో ఎప్పుడూ ముందుండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్.. తాజాగా యాక్షన్ సీక్వెన్స్‌పై స్పందించింది. అంతేగాకుండా నటి మెరిల్ స్ట్రీప్, యాక్షన్ స్టార్ టామ్ క్రూస్ కంటే తాను గొప్పగా స్టంట్లు చేయగలనని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. తన కొత్త సినిమాలు తలైవి, థాకడ్‌ సినిమాల కోసం తీసుకున్న శిక్ష‌ణ‌, ఆ సినిమా లుక్‌ల‌ను పోస్ట్ చేస్తూ ఆమె ఈ వ్యాఖ్య‌లు చేసింది.
 
త‌న స్థాయిలో నటించగలిగే మరో నటి ప్రస్తుతం ఈ భూమి మీద లేదని చెప్పింది. వైవిధ్యమైన పాత్రలు అద్భుతంగా పోషించే హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్‌లో ఉండే ప్రతిభ త‌నలో ఉందని చెప్పుకొచ్చింది. అంతేగాక‌, ఇజ్రాయిల్‌ ప్రముఖ నటి గాల్ గాడోట్‌లా తాను యాక్షన్‌ చేయగలనని చెప్పింది. మ‌రోవైపు, గ్లామరస్‌గానూ కనిపించగలనని ట్వీట్లు చేసింది. దీంతో ఆమెపై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తుండ‌డంతో మ‌రో ట్వీట్ చేసింది.  
 
ఎన్ని ఆస్కార్‌లు సాధించావంటూ త‌న‌ను కొంద‌రు అడుగుతున్నార‌ని, వారికి తాను ఒకటే చెప్ప‌గ‌ల‌న‌ని పేర్కొంది. మెరిల్ స్ట్రీప్ ఎన్ని జాతీయ అవార్డులు సాధించిందని ఆమె ప్ర‌శ్నించింది. అలాగే, ఎన్ని పద్మ అవార్డులు సాధించిందని అడిగింది. ఈ ప్రశ్నల‌కు సమాధానం ఉండదని, విమ‌ర్శ‌లు చేస్తోన్న వారు బానిస మనస్తత్వం నుంచి బయటపడాల‌ని ఆమె మండిప‌డింది. ఆత్మ గౌరవంతో మెల‌గాల‌ని చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహారాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం... కీలక శాఖలన్నీ బీజేపీ వద్దే..

Zakir Hussain ఉస్తాద్ జాకీర్ హుస్సేనే ఇకలేరు... నిర్ధారించిన కుటుంబ సభ్యులు

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

మీడియా ప్రతినిధిని కావాలని కొట్టలేదు.. సారీ చెప్పిన మోహన్ బాబు (video)

తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ ఇకలేరు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments