Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తకాలను వీలైతే బాత్రూమ్‌కి కూడా తీసుకెళ్తా: నెటిజన్లకు ట్వింకిల్ ఖన్నా షాక్

న‌టిగా, ర‌చ‌యిత‌గా, అక్ష‌య్ కుమార్ భార్య‌ ట్వింకిల్ ఖన్నా నెటిజన్లకు సరైన సమాధానంతో షాక్ ఇచ్చింది. పుస్తకాల మీద కూర్చుని ట్వింకిల్ దిగిన ఫోటోను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. తన కాలి కింద వున్న

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (16:22 IST)
న‌టిగా, ర‌చ‌యిత‌గా, అక్ష‌య్ కుమార్ భార్య‌ ట్వింకిల్ ఖన్నా నెటిజన్లకు సరైన సమాధానంతో షాక్ ఇచ్చింది. పుస్తకాల మీద కూర్చుని ట్వింకిల్ దిగిన ఫోటోను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. తన కాలి కింద వున్నవి కూడా పుస్తకాలే అనుకుని ఆమెపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. 
 
పుస్తకాలను ఎవరైనా కాలితో తొక్కుతారా? అని ప్రశ్నించారు. రచయితవై యుండి పుస్తకాలను ఇలా కించపరుస్తావా? ఇదే విధంగా నీ పుస్తకాలను కూడా ఇలాగే చేస్తే ఏం చేస్తావ్? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పందించిన ట్వింకిల్ తాను పుస్తకాలపై కాలు పెట్టలేదని.. సరిగ్గా చూడమని స్పష్టత ఇచ్చింది. 
 
కానీ నెటిజన్లు వెంటనే పుస్తకాల మీద కూర్చోవడం కూడా తప్పేనంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లపై ట్వింకిల్ ఖన్నా నెటిజన్లకు షాకిచ్చే కామెంట్స్ పెట్టింది. తనకు పుస్తకాల మీద కూర్చునేందుకు ఎలాంటి సంకోచం లేదు. వాటి పక్కనే పడుకుంటా..  వీలైతే బాత్రూమ్‌కి కూడా తీసుకెళ్తానని సమాధానమిచ్చింది. పుస్త‌కాల‌ను చ‌దివిన‌పుడే జ్ఞానం వ‌స్తుంది, వాటిని గౌర‌వించిన‌పుడు కాదంటూ గట్టిగా సమాధానమిచ్చింది. దీంతో నెటిజన్లు షాక్ తిన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments