Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఒక‌వేళ నువ్వు బ్ర‌తికి ఉంటే ఇంటికి రా.. నేనే నిన్ను చంపేస్తాను'.. స్టార్ హీరోకు భార్య వార్నింగ్

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (17:05 IST)
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా గట్టివార్నింగ్ ఇచ్చారు. మంటల నుంచి బతికి బయటపడి ఇంటికి వస్తే నేను చంపేస్తానంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. ఇంతకు తన భర్తకు ఆమె అంత గట్టిగా వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్‌, ఆయ‌న భార్య ట్వింకిల్ ఖ‌న్నా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌న‌సులోని మాట‌ల‌ని కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా మాట్లాడుకునే వీరు తాజాగా ఓ ఇష్యూపై కాస్తభిన్నంగా స్పందించారు. 
 
'ది ఎండ్' అనే వెబ్‌సిరీస్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా అక్షయ్ కుమార్ తన శరీరానికి నిప్పంటించుకుని వేదికపైకి నడిచివచ్చే సాహసం చేశారు. ఆ క్ష‌ణంలో అక్ష‌య్‌ని చూసిన అభిమానుల‌కి గుండె ఆగినంత ప‌నైంది. ఇవి మీడియాలో ప్రసారమయ్యాయి. 
 
అక్షయ్‌ను చూసిన అభిమానులే అంతగా బెంగపడిపోతే.. మరి భార్య ట్వింకిల్ ఖన్నా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈ క్ర‌మంలో ఆమె త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా.. "దారుణం! ప్ర‌మోష‌న్ కోసం నీ ఒంటికి నీవే నిప్పంటిచుకున్నావు. ఒక‌వేళ నువ్వు బ్ర‌తికి ఉంటే ఇంటికి రా.. నేనే నిన్ను చంపేస్తాను" అని ఫైర్ అయింది. 
 
దీనిపై స‌ర‌దాగా స్పందించిన అక్ష‌య్ కుమార్ ఈ విష‌యంలో నాకు భ‌య‌మేస్తుందని అన్నారు. సాహస‌మే త‌న ఊపిరి అంటున్న అక్ష‌య్ కుమార్ త‌న ర‌క్తంలోనే యాక్ష‌న్ ఉంద‌న్నాడు. ముందు తాను స్టంట్‌మేన్ అని చెప్పిన అక్ష‌య్ ఆ త‌ర్వాతే యాక్ట‌ర్ అని గుర్తుచేశాడు. 
 
తన కుమారుడు ఆరవ్‌ సూచన మేరకు ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి అంగీకరించినట్టు వివరించారు. బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్ ప్ర‌స్తుతం 'కేసరి', 'సూర్యవంశి' అనే చిత్రాలతోనూ బిజీగా ఉన్నారు. మార్చి 21న 'కేసరి' ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments