జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో జరిపినట్టుగా దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే ఏ మహమ్మద్ సంస్థ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశంలోని ముఖ్య నగరాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు.
ముఖ్యంగా, పుల్వామా దాడి తర్వాత ఈ నెల 16, 17 తేదీల్లో పాకిస్థాన్ దేశంలోని జైషే మహ్మద్ నాయకులు, కాశ్మీర్ లోయలో ఉన్న ఉగ్రవాదులతో సంభాషించారని, ఆ సంభాషణలో జమ్మూ లేదంటే జమ్మూ కాశ్మీర్ బయటి ప్రాంతంలో ఎదో ఒకచోట భారత జవాన్లపై భారీ దాడి చేయాలని వ్యూహం పన్నినట్లు ఇంటలిజెన్స్‌కు సమాచారం అందింది. ఈ సమాచారాన్ని కేంద్ర హోం శాఖకు ఇంటెలిజెన్స్ అధికారులు చేరవేశారు. ఫలితంగా హోం శాఖ ఆదేశాల మేరకు కీలక నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.