Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలస్యంగా వస్తే సూసైడ్ చేసుకుంటా... అన్నంత పని చేసిన టీవీ నటుడు భార్య

Webdunia
బుధవారం, 7 ఆగస్టు 2019 (09:18 IST)
షూటింగ్ నుంచి ఆలస్యంగా వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన ఓ టీవీ నటుడు భార్య... చివరకు అన్నంత పనిచేసింది. ఆ టీవీ నటుడు మధు ప్రకాష్. ఈయన భార్య పేరు భారతి (34). ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బుల్లితెర నటుడుగా ఉన్న మధుప్రకాశ్.. వివిధ సీరియల్స్ షూటింగ్స్ కారణంగా ఇంటికి ఆలస్యంగా వస్తుండేవాడు. దీంతో ఆయనకు భార్యకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఇదే అంశంపై వారిద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగింది. అయితే ఆమె మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా షూటింగ్ నుంచి ఆలస్యంగా రావడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసింది. అయితే, మధుప్రకాష్ దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. 
 
ఈ క్రమంలో మంగళవారం భర్తకు వీడియో కాల్ చేసిన భారతి తాను ఉరివేసుకుంటున్నట్టు చెప్పి బెదిరించింది. మధుప్రకాశ్ దీనిని తేలిగ్గా తీసుకున్నాడు. షూటింగ్ ముగిశాక సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్లాడు. బెడ్‌రూంకు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో భార్యను పిలిచాడు. 
 
అయినప్పటికీ లోపలి నుంచి స్పందన లేకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి చూసి నిర్ఘాంతపోయాడు. లోపల భార్య చీరతో సీలింగ్‌కు ఉరివేసుకుని కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
కాగా, ఈ దంపతులకు గత 2015లో వివాహమైంది. వీరిద్దరూ హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీలో నివశిస్తున్నారు. మధుప్రకాశ్ టీవీ నటుడు కాగా, భారతి ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నారు. షూటింగులలో బిజీగా ఉంటున్న మధుప్రకాశ్ ఇటీవల తరచూ ఇంటికి ఆలస్యంగా వస్తుండడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం కూడా ఇదే విషయమై గొడవ జరిగి, చివరకు అది విషాదంతో ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments