Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య... వదిలాడురా బిగ్ బాస్... జాఫర్ అలా అనుకున్నాడా?

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (21:57 IST)
బిగ్ బాస్ సీజన్ 3 అంచ‌నాల‌ను తల‌కింద్ర‌లు చేస్తూ... సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా చేస్తుండ‌డంతో మ‌రింత క్రేజ్ ఏర్ప‌డింది. ఈ రియాల్టీ షో రెండు వారాలను పూర్తిచేసుకుని మూడవ వారంలోకి ఎంటర్ అయ్యింది.

రెండవ వారంలో బిగ్ బాస్ నుండి జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. మొదటి వారంలో కూడా నామినేషన్లో ఉన్న జాఫర్‌కు ఓట్లు బాగానే పడటంతో హేమ ఔట్ అయ్యి జాఫర్ ఉన్నారు. అయితే రెండవ వారంలో మాత్రం ప్రేక్షకులు జాఫర్ కు తక్కువ ఓట్లు వేశారు అంటూ బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడం జరిగింది. 
 
సోషల్ మీడియాలో గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం ప్రకారం వితిక షేరు ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నారు. కాని జాఫర్ ఎలిమినేట్ అవ్వడం చాలా మందికి షాక్ ఇచ్చింది. 
 
ఇంకా చెప్పాలంటే... దీని వెన‌క ఏమైనా జ‌రిగిందా..? అనే అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఎలిమినేషన్‌లో ఒకొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున చివర్లో జాఫర్ మరియు వితికలను ఉంచాడు. దాంతో ఖచ్చితంగా వితికనే అనుకున్నా కూడా జాఫర్ బయటకు వచ్చేశాడు. 
 
అయితే... దీనికి కార‌ణం ఏంటంటే... జాఫర్ ఇంట్లో వారితో కలిసి పోలేకపోవడంతో పాటు తన కుటుంబంను మిస్ అవుతున్నాడు. దాంతో ఆయన నన్ను ఎలిమినేట్ చేయండి అంటూ కోరడం కూడా జరిగింది.
 
 అయితే ఎలిమినేషన్లో ఉన్న అతడు కొన్నిసార్లు హౌస్‌లో ఉండాలనే అనుకున్నాడు. వెళ్లే ముందు కూడా ఎమోషనల్ అయ్యాడు. ఆయన వెళ్లి పోవాలనుకున్నా కూడా ప్రేక్షకులు ఓట్లు బాగానే వేశారని వితిక షేరు కంటే కూడా అధికంగా పడి ఉంటాయంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
జాఫర్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయకపోవడంతో పాటు ఇచ్చిన టాస్క్‌లను కూడా ఆయన పూర్తిచేయడం లేదని బిగ్ బాస్ టీం ఆయనకు ఓట్లు పడ్డా కూడా వితికను సేవ్ చేసి ఆయన్ను ఎలిమినేట్ చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ... జాఫ‌ర్ మాత్రం హౌస్ నుంచి బ‌య‌ట‌కు హ్యాపీగానే వ‌చ్చారు త‌ప్ప.... ఇంకా ఉంటే బాగుండు అని కానీ... త‌న‌ని అన‌వ‌స‌రంగా ఎలిమినేట్ చేసార‌ని కానీ అన‌లేదు. అదీ సంగతి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

యూఎస్ వీసా అప్లికేషన్ సెంటర్‌గా మారనున్న రుషికొండ ప్యాలెస్‌?

విషం తాగింది.. ఆపై ఆస్పత్రి భవనం నుంచి దూకేసింది.. ఏమైందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments