Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్‌కు షాక్ ఇచ్చిన త్రివిక్రమ్..!

Webdunia
మంగళవారం, 5 మే 2020 (20:48 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. నందమూరి హీరో ఎన్టీఆర్ - మెగా హీరో రామ్ చరణ్‌‌ల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటివరకు 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పూణెలో జరగాల్సిన భారీ షెడ్యూల్ వాయిదా పడింది. 
 
కరోనా వలన వాయిదా పడిన ఈ భారీ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో..? ఎప్పటికి పూర్తవుతుందో..? ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్టు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేసారు. ఈ సమ్మర్లో ఈ సినిమాని స్టార్ట్ చేయాలి అనుకున్నారు. 
 
వచ్చే సంవత్సరం సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే... కరోనా వలన షూటింగ్స్ అన్నీ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్‌కి బాగా దెబ్బ అని చెప్పచ్చు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాతే ఎన్టీఆర్ త్రవిక్రమ్ సినిమాకి డేట్స్ ఇస్తాడు.
 
 ఆర్ఆర్ఆర్ పూర్తి చేసి రావాలంటే.. చాలా టైమ్ పట్టేలా ఉంది. అందుచేత త్రివిక్రమ్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడం కంటే ముందుగా విక్టరీ వెంకటేష్‌తో సినిమా చేయాలనుకుంటున్నారని తెలిసింది. 
 
ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. గతంలో వెంకటేష్‌ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకి త్రివిక్రమ్ కథ మాటలు అందించారు. ఇప్పుడు వెంకీతో సినిమాని డైరెక్ట్ చేయబోతుండటం విశేషం. మరి.. ఈసారి వెంకీని ఎలా చూపించబోతున్నారో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments