త్రిషకి... భారీ ఛాన్స్? అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి?

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (18:09 IST)
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్.. తాప్సీలు ప్రధాన పాత్రధారులుగా రూపొందిన 'బద్లా' సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగు... తమిళ భాషలలో రీమేక్ చేసేందుకు నిర్మాత ధనుంజయ్ సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. 
 
తన ప్రమేయం లేకుండానే ఒక హత్య కేసులో చిక్కుకున్న ఒక అమ్మాయి (తాప్సీ)ని కాపాడటానికి ఒక లాయర్‌ (అమితాబ్)గా రంగంలోకి దిగుతాడు. ఆ తరువాత చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. 
 
కాగా... ఈ సినిమా రీమేక్‌లో తాప్సీ పాత్ర కోసం త్రిషను తీసుకునే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయని వినికిడి. ఇటీవల '96' హిట్‌తో త్రిష క్రేజ్ మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ పాత్రకు ఆమెను ఎంచుకున్నారని చెప్తున్నారు. త్రిష ఎంపిక దాదాపు ఖరారైపోతుందనే అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి. అదే నిజమైతే... త్రిష కెరీర్‌లో మరో హిట్ కూడా చోటు చేసుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments