సంజయ్ లీలా భన్సాలీ.. సల్మాన్ ఖాన్‌తో నా కల నెరవేరబోతోంది.. అలియా భట్

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (17:44 IST)
ఈ ఏడాది వరుస విజయాలతో, చేతి నిండా అవకాశాలతో దూసుకుపోతోంది బాలీవుడ్ భామ అలియాభట్. ఇప్పటికే మూడు భారీ బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న ఈమెకు తాజాగా మరో భారీ ఆఫర్ వచ్చి పడింది. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహించే తదుపరి సినిమాలో హీరోయిన్‌గా అలియాకు అవకాశం వచ్చింది. 
 
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన అలియా నటించబోతోంది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. "నాకు తొమ్మిదేళ్ల వయస్సులో సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన సినిమాలో నాకు అవకాశం ఇస్తారో లేదో అన్న భయం ఆందోళనతో వెళ్లాను. అయితే అది గతం. అప్పటి కల ఇప్పుడు నెరవేరింది. 
 
సంజయ్ చెప్పినట్లే నేను చాలా పెద్ద కలలు కన్నాను. సంజయ్, సల్మాన్ కాంబినేషన్‌లో మ్యాజిక్ ఉంటుంది. ఈ అందమైన ప్రయాణంలో భాగమవ్వాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా 2020లో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కాలుష్యానికి చెక్.. పవన్ పక్కా ప్లాన్

తనకంటే అందంగా ఉన్నారని అసూయ.. ముగ్గురు బాలికలను చంపేసిన కిరాతక లేడీ

అనకాపల్లిలో 480 ఎకరాల భూమిలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. 28 ఏళ్ల వ్యక్తికి కడప పోస్కో కోర్టు జీవిత ఖైదు

బలహీనపడిన వాయుగుండం... మరో రెండు రోజులు వర్షాలే వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments