Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫినాలేకు బిగ్ బాస్ నాలుగో సీజన్.. ముఖ్య అతిథిగా ఆయన వస్తున్నారట..?

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (20:20 IST)
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫైనల్‌కు చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ యాజమాన్యం గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫినాలెకు వచ్చే అతిథిపై చర్చ జరుగుతోంది. బిగ్‌బాస్-3 ఫినాలేకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ ఏడాది ఫినాలేకు ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే స్టార్ మా నిర్వాహకులు మహేష్‌ను సంప్రదించారట. మహేష్ సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తోంది. మరోవైపు అతిథి పేర్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తున్నాయి.
 
కాగా, మరో రెండు వారాల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్ కార్యక్రమం పూర్తి కాబోతోంది. ఈ నెల 20వ తేదీన గ్రాండ్ ఫినాలేకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ షోలో నాగార్జున చిన్న తనయుడు అఖిల్‌, హైపర్ ఆది పాటు సమంత హోస్ట్‌గా వ్యవహరించింది. 
 
గతవారం కన్నడ స్టార్ హీరో సుదీప్ బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశారు. ఈయన కన్నడ బిగ్‌బాస్‌ను హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మహేష్ బాబు రాకతో ఈ షోకు మరింత క్రేజ్ తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు స్టార్ మా నిర్వాహకులు.
 
ఇకపోతే.. బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫైనల్‌కు చేరుకునే సరికి రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్‌లు , కంటెస్టెంట్స్ మధ్య గొడవలు , కంటెస్టెంట్స్ మధ్య ప్రేమలు.. ఈ షో పైన ఆసక్తిని పెంచుతున్నాయి. ఇక ఈ వారం ఒకరు, వచ్చే వారం మరొకరు ఎలిమినేట్‌ కానుండగా చివరి వారం ఐదురుగు సభ్యులు మాత్రమే హౌజ్‌లో ఉంటారు. ఈ ఐదుగురిలో ఒకరు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విజేత అవుతారు. 
 
ఈ వారం ఒకరు ఎలిమినేట్‌ కానుండగా.. నామినేషన్‌లో అవినాష్‌, అఖిల్‌, మోనాల్‌, అభిజీత్‌, హారిక ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనే ఆసక్తి అందరిలో ఉంది. అయితే.. ఈ వారం మోనాల్‌ బిగ్‌ బాస్‌ హౌజ్‌ని వీడక తప్పదు అని అంటున్నారు. మరి ఎలిమినేషన్‌ రేసులో ఎవరున్నారో తెలియాలంటే వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments