Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌తో విడాకులు.. అకీరా, ఆద్య గురించి మాట్లాడుతూ.. రేణు కన్నీళ్లు..

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (20:07 IST)
Renu Desai
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ప్రేమించి వివాహం చేసుకున్న నటి రేణు దేశాయ్.. ఆయనతో విడాకులు తీసుకున్నారు. తన ఇద్దరు పిల్లలు అకీరా నందన్ - ఆద్యలతో కలిసి జీవిస్తున్నారు. బద్రి, జానీ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన రేణు దేశాయ్ నటనకు దూరం అయ్యింది. కానీ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రచయితగా నిర్మాతగా దర్శకురాలిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 
 
తండ్రికి దూరంగా ఉంటున్నప్పటికీ వారికి ఆ లోటు తెలియకుండా పెంచి పెద్ద చేస్తోంది. తాజాగా ఓ షో లో పాల్గొన్న రేణు దేశాయ్ తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న 'సుమక్క' యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారం అవుతున్న ఓ కార్యక్రమంలో రేణు పాల్గొంది. రేణు దేశాయ్ బర్త్ డే నేపథ్యంలో ఈ స్పెషల్ ప్రోగ్రామ్‌ని ప్రసారం చేశారు.
 
సుమ - రేణుదేశాయ్ మధ్య సరదా సంభాషణలతో ఈ షో ఫన్నీగా సాగింది. ఈ షోలో తన పిల్లలు ఆద్య అకీరాల గురించి మాట్లాడిన రేణు దేశాయ్ కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఆద్య - అకీరాలే తనకు సర్వస్వం అని.. తన పిల్లలిద్దరూ ఏదైనా ఫంక్షన్స్ లేదా పవన్ షూటింగ్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడి డైరెక్టర్లు నటీనటులు ఆ ఇద్దరినీ చూసి తనకు ఫోన్ చేసి వారి గురించి మాట్లాడేవారని రేణు చెప్పుకొచ్చింది.
 
అకీరా, ఆద్య చాలా చక్కగా వున్నారని.. అందరితో కలిసిపోతున్నారని వాళ్లు చెప్పేవారని.. ఒక తల్లిగా ఆ క్షణాలు తనకెంతో సంతోషం కలిగించేవని తెలుపుతూ రేణు దేశాయ్ భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా సుమ 'బెస్ట్ మామ్ ఎవర్' అంటూ రేణు తన పిల్లలతో దిగిన ఫోటోను ముద్రించిన ఓ టీ కప్పుని ఆమెకు గిఫ్ట్‌గా అందించింది. ప్రస్తుతం 'సుమక్క' ఛానల్‌లోని రేణు దేశాయ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments