Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

ఠాగూర్
శనివారం, 28 జూన్ 2025 (15:51 IST)
ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి సెటైర్లు వేశారు. దిల్ రాజుకు రన్నింగ్స్ రాజు అని పేరుపెట్టివుంటే బాగుండేందని తెలిపారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు దిల్ రాజు డ్రీమ్స్‌ను ఏర్పాటు చేశారని దిల్ రాజు తెలిపారు. ఆయన కొత్త ప్రయత్నం విజయం సాధించాలంటూ అనిల్ రావిపూడి ఓ ఆకాంక్ష చేశారు. 
 
ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దిల్ రాజుతో తన ప్రయాణం పదేళ్లుగా కొనసాగుతుందన్నారు. 'పటాస్' సినిమా తర్వాత ఆయనతో "సుప్రీం" సినిమా చేశానని వెల్లడించారు. దిల్ రాజు ఎపుడూ ఒకే చోట ఆగరు, నిరంతరం ఏదో ఒక కొత్తదనం కోసం పరుగెడుతూనే ఉంటారని తెలిపారు. అందుకే ఆయనకు "దిల్ రాజు" అని కాకుండా "రన్నింగ్ రాజు" అని పేరు పెడితే బాగుంటుందని అనిల్ రావివూడి తనదైనశైలిలో చమత్కరించారు. 
 
చిత్రపరిశ్రమలో అన్ని జానర్లు సినిమాలను ప్రయత్నించే దిల్ రాజు ఇపుడు కొత్త వారికి అవకాశం కల్పించేందుకు "దిల్ రాజు డ్రీమ్" అనే దవేదికను ముందుకు తీసుకొస్తున్నారని తెలిపారు. కొత్త వారి ఐడియాలను గుర్తించి, వారిని ప్రోత్సహించాలనేది దిల్ రాజు మంచి ఆలోచన. ఈ ప్రయత్నం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అనిల్ రావిపూడి తెలిపారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీఆర్ - చంద్రబాబు - పవన్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments