Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ చాంబర్‌కు సిరివెన్నెల పార్థివదేహం : ప్రముఖుల నివాళులు

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (09:59 IST)
అకాల మరణం చెందిన ప్రముఖ సినీ గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ చాంబర్‌కు బుధవారం ఉదయం తరలించారు. అక్కడ సిరివెన్నెలకు అనేక సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళిలు అక్కడకు చేరుకుని నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా సిరివెన్నెల కుటుంబ సభ్యులను ఓదార్చారు. 
 
ముఖ్యంగా, సినీ నటుడు తనికెళ్ల భరిణి కన్నీటి పర్యంతమయ్యారు. స్రవంతి మూవీస్‌లో తామిద్దరం కలిసి పనిచేశాని గుర్తు చేసుకున్నారు. ప్రతి పదాన్ని చెక్కేవాడాని, ఆయన పాట వజ్రం పొదిగినట్టు ఉండేదని, ఆయన పాటల ప్రకాశం తెలుగు జాతి ఉన్నంతవరకు నిలిచివుంటుందన్నారు. 
 
అలాగే, ప్రతి నాయకుడు రావు రమేష్ మాట్లాడుతూ, ఆ సరస్వతీ పుత్రుడు గురించి మాట్లాడే అర్హత, అనుభవం తనకు లేదన్నారు. చాలా గొప్పగా తండ్రి పేరును నిలబెడతావన్న ఆయన మాటలు తనలో స్ఫూర్తిని నింపాయన్నారు. 
 
అదేవిధంగా హీరో వెంకటేష్, సంగీత దర్శకుడు మణిశర్మ, దర్శకుడు గుణశేఖర్, సింగర్ సునీత, పరుచూరి గోపాలకృష్ణ, స్రవంతి రవికిషోర్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సాయికుమార్, హీరో బాలకృష్ణ, అల్లు అర్జున్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

Jagan: సినిమా చూపిస్తాం.. తప్పు చేసిన వారికి చుక్కలు ఖాయం.. యాప్ రెడీ.. జగన్

వివాహితను కలిసేందుకు అర్థరాత్రి వెళ్లాడు.. గ్రామస్థుల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు..

సునామీ ప్రళయం ముంగిట భారత్? నిజమా? ఇన్‌కాయిస్ ఏమంటోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments