Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ 25వ సినిమా పరాశక్తి టైటిల్ పోస్టర్

డీవీ
బుధవారం, 29 జనవరి 2025 (16:53 IST)
Vijay Antony - Parashakti
విజయ్ ఆంటోనీ వినూత్న కథాంశాలతో వైవిద్యభరితమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన 25వ చిత్రాన్ని ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పరాశక్తి అనే పేరుతో ఈ సినిమా రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. 
 
"అరువు", "వాజిల్" వంటి ప్రసిద్ధ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు, రచయిత అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో అసాధారణమైన నటన, అంకితభావాన్ని ప్రదర్శించనున్నారట. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ మరింత ఆకట్టుకోవడమే గాక, ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
 
పరాశక్తి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు మాస్ అప్పీల్, అత్యుత్తమ యాక్షన్, హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథ ఎలిమెంట్స్ కలిగి ఉంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు వాగై చంద్రశేఖర్, సునిల్ కృష్ణ, సెల్ మురుగన్, త్రుప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి ప్రతిభావంతమైన నటీనటులు భాగంగా ఉన్నారు.  
 
టెక్నికల్ విభాగంలో సినిమాటోగ్రఫీ షెల్లీ కాలిస్ట్, సంగీతం విజయ్ ఆంటోనీ, ఎడిటింగ్ రేమండ్ డెరిక్ క్రస్టా, యాక్షన్ కొరియోగ్రఫీ రాజశేఖర్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా 2025 వేసవిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
 
నటీనటులు: విజయ్ ఆంటోనీ, వాగై చంద్రశేఖర్, సునిల్ కృష్ణ, సెల్ మురుగన్, త్రుప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

మురుగు కాలువలో మహిళ మృతదేహం - ముక్కుపుడకతో వీడిన మిస్టరీ!

వీధి కుక్కలపై అత్యాచారం చేసిన దుండగుడు.. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు..

బాపట్లలో రైల్వే విశ్రాంత ఉద్యోగితో వివాహేతర సంబంధం, పెట్రోలు పోసుకుని వాటేసుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments