Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా సంహారం

Advertiesment
Sanharam

డీవీ

, బుధవారం, 29 జనవరి 2025 (14:50 IST)
Sanharam
గతంలో దాసరి, మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ వద్ద  వందకు పైగా  సినిమాలకు  స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన ధర్మ ఇప్పుడు మెగా ఫోన్ పట్టారు.  రత్న మేఘన క్రియేషన్స్  పతాకంపై దర్శక, నిర్మాతగా ఆయన  తెరకెక్కించిన  చిత్రం "సంహారం". ఆదిత్య, కవిత మహతో  హీరో హీరోయిన్లుగా నటించారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. చిత్రం పాటలను, ప్రోమోస్ ను ప్రదర్శించారు.
 
అతిధిగా విచ్చేసిన దర్శకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ, దాసరి గారి కాంపౌండ్ లో పలు చిత్రాలకు ధర్మ పనిచేయడం వల్ల నాకు పరిచయం ఉంది. చిత్రపరిశ్రమలోని ఆటుపోట్లను  సుదీర్ఘ అనుభవంలో అర్ధం చేసుకుని, అవహగాన చేసుకున్న టెక్నీషియన్ ధర్మ ఈ చిత్రం ద్వారా దర్శక, నిర్మాతగా మారడం అభినందనీయం. పాటలు, ప్రోమోస్ చాలా బావున్నాయి" అని అన్నారు. 
 
దర్శక, నిర్మాత ధర్మ మాట్లాదుతూ, "రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఒక అమ్మాయి తనకు, తన అక్కకు అనుకోని ఘటనలు ఎదురైనపుడు తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తో దుష్టులను ఎలా ఎదుర్కొంది అన్న పాయింట్ తో ఈ సినిమాను మలిచాం. తమను తాము కాపాడుకునేందుకు అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్ అత్యంత ఆవశ్యకమని ఈ చిత్రంలో చూపించాం. సంగీత సాకేత్ సాయిరాం ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించడంతో పాటు మంచి సంగీతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం మా అందరి అంచనాలను నిలబెడుతుంది" అని చెప్పారు. 
 
సంగీత దర్శకుడు, ఈ చిత్రంలో విలన్ గా నటించిన సాకేత్ సాయిరాం మాట్లాడుతూ, ఇప్పటివరకు 44 సినిమాలకు సంగీతాన్ని అందించాను. గతంలో నేను దర్శకత్వం వహించిన చిత్రాలలో కూడా నటించాను. కాకపోతే ఈ చిత్రంలోని ప్రధాన విలన్ పాత్ర పేరు తెచ్చిపెడుతుందన్న నమ్మకం ఉంది. ఇందులో నాలుగు పాటలు ఉన్నాయి. పాటలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి" అనిఅన్నారు . 
 
ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో కోటయ్య, రాధోడ్, స్నేహశర్మ, రామకృష్ణ, రామిరెడ్డి, దాస్, సాయి, సాయిరాం చౌదరి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతం: సాకేత్ సాయిరాం, ఛాయాగ్రహణం: శ్రీనివాస్ శ్రీరాముల, ఎడిటింగ్: కృష్ణ, డాన్స్: వినయ్, సమర్పణ: శ్రీరాముల నాగరత్నం, నిర్మాత, దర్శకత్వం: ధర్మ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా లైఫ్‌లో తండేల్ అల్లు అరవింద్ గారే : అక్కినేని నాగచైతన్య