Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ పోతే పోయింది.. యూట్యూబ్ వుందిగా.. దుర్గారావుకు లక్షమంది సబ్‌స్క్రైబర్లు..!

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (19:35 IST)
Tik Tok Star
తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ సమయంలో ఎక్కువగా పాపులర్ అయ్యాడు టిక్ టాక్ స్టార్ దుర్గారావు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌పై బ్యాన్ విధించింది. దీంతో దుర్గారావు టిక్‌టాక్ ప్రత్యామ్నాలపై దృష్టి పెట్టాడు. ఇక ఈయన టిక్ టాక్‌లో తనకు మాత్రమే సాధ్యమయ్యే డ్యాన్స్ మూమెంట్స్‌తో యమ పాపులర్ అయ్యాడు. రీసెంట్‌గా దుర్గారావు జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
 
హైపర్ ఆది స్కిట్‌లో దర్శన మిచ్చిన దుర్గారావు.. అక్కడ కూడా అదరగొట్టాడు. ఉన్నది కొద్ది సేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అదరగొట్టాడు. ఆ తర్వాత 'అదిరింది'లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ యాప్ ఉన్నప్పుడు తన భార్యతో కలిసి తెలుగు సినిమా పాటలకు స్టెప్స్ వేస్తూ.. దానికి తగ్గట్లుగా మేకప్, క్యాస్టూమ్స్ మార్చుతూ అదరగొట్టేవాడు. 
 
ఎంతలా అంటే మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. ఇపుడు టిక్‌టాక్ లేకపోవడంతో ఇతను సరికొత్తగా దుర్గారావు నాట్యమండలి పేరుతో ఈ యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశాడు. అందులో తన భార్యతో కలిసి వివిధ డాన్సులకు తమదైన స్టెప్పులతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈయన యూట్యూబ్ ఛానెల్‌కు శేఖర్ మాస్టర్ సహా పలువురు దుర్గారావును సమర్ధించారు.
 
తాజాగా వీరి యూట్యూబ్ ఛానెల్‌కు లక్ష మంది సబ్‌స్క్రైబర్లు నమోదు అయ్యారు. అది కూడా కేవలం పదిహేను రోజుల్లో దుర్గారావుకు సంబంధించిన యూట్యూబ్ చానెల్‌కు సబ్ స్క్రైబ్ అయ్యారు. ఎంతో పాపులర్ వ్యక్తులు పెట్టిన యూట్యూబ్ ఛానెల్‌కు ఇంతమంది సబ్ స్క్రైబర్స్ లేరు. కానీ టిక్‌టాక్‌తో ఫేమసైన దుర్గారావు మాత్రం కేవలం పదిహేను రోజుల్లో ఈ ఘనత సాధించడం విశేషం. దీంతో దుర్గారావు దంపతులు.. తమ యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments