Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబరు 13న "నిప్పు - నీరు కలిసి వస్తున్నాయ్"... ఆర్ఆర్ఆర్ లేటెస్ట్ అప్‌డేట్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (14:08 IST)
ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌). డి.వి.వి.దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం క్లైమాక్స్ షూటింగ్ జ‌రుగుతుంది. అత్యంత పరాక్రమశాలి భీం, ఉగ్రరూపుడైన రామరాజు తమ ఉమ్మడి లక్ష్య సాధనకు సంసిద్ధులవుతున్నట్టుగా ఇటీవ‌ల చిత్ర యూనిట్ ప్రకటించింది. 
 
స్వాతంత్య్ర సమరయోధులు కొమరంభీం, అల్లూరి సీతారామరాజు చారిత్రక ఇతివృత్తానికి కాల్పనిక అంశాల్ని మేళవించి రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మేక‌ర్స్ తాజాగా స‌ర్‌ప్రైజ్ అప్‌డేట్ ఇచ్చారు. సోమవారం మ‌ధ్యాహ్నం మూవీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. అక్టోబరు 13వ తేదీన ప్రేక్షకుల ఈ చిత్రం విడుదల కానుంది.
 
నిప్పు - నీరు కలిసి ఓ శక్తిగా మీ మందుకు వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అనుభూతిని పొందుతారని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రంలో అలియాభట్‌, ఒలివియోమోరిస్‌ కథానాయికలుగా న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments