Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్‌లో ప్రారంభమైన సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు `స‌ర్కారు వారి పాట' షూటింగ్

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (13:55 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం 'సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీను నిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేస్తూ `ది ఆక్ష‌న్ అండ్ ది యాక్ష‌న్ బిగిన్స్` అంటూ ఒక వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల మాట్లాడుతూ - ``సర్కారు వారి పాట` మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గారిని డైరెక్ట్‌ చేయాల‌న్న ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకుల, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇర‌వై రోజుల పాటు దుబాయ్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం`` అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఎస్.ఎస్ మాట్లాడుతూ - ``స‌ర్కారు వారి పాట రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైన సంద‌ర్భంగా టీమ్ అంద‌రికీ ఆల్ ది బెస్ట్`` అన్నారు. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు మరియు భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి,
 
సంగీతం: త‌మన్ ఎస్‌.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫి: మ‌ధి,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్,
ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్,
పిఆర్ఓ: బి.ఏ.రాజు,  
లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్,
కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్,    
సీఈఓ: చెర్రీ,
నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,
రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments